చిరూ సినిమా రిలీజ్ అయితే అప్పట్లో గోల గోల చేసేవాడిని: శ్రీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ సినిమా రిలీజ్ అయితే అప్పట్లో గోల గోల చేసేవాడిని: శ్రీకాంత్

  • చిరంజీవి గారు నాకు స్ఫూర్తి 
  • ఆయన సినిమాల రిలీజ్ రోజున తెగ సందడి చేసేవాడిని
  • ఆయన వల్లనే సినిమాలపై క్రేజ్ పెరిగింది
కెరియర్ ఆరంభంలో నెగెటివ్ పాత్రలు చేసిన శ్రీకాంత్, ఆ తరువాత హీరోగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. అలాంటి శ్రీకాంత్ తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు. అలీ అడిగిన ఒక ప్రశ్నకి స్పందించిన శ్రీకాంత్, తనకి స్ఫూర్తి చిరంజీవిగారు అని చెప్పాడు.

 'అవి నేను 9 .. 10 తరగతులు చదువుతోన్న రోజులు. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అనగానే ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఊరికి దగ్గరున్న 'బాపట్ల' వెళ్లిపోయే వాళ్లం. చేతిలో పూలు .. రంగు కాగితాలు .. చిల్లర డబ్బులు పట్టుకుని కూర్చునేవాళ్లం. తెరపై చిరంజీవి ఎంట్రీ ఇవ్వగానే ఆనందంతో అరిచి గోలచేస్తూ తెరపై చల్లేసే వాళ్లం. చిరంజీవి సినిమాలు చూడటం వలన నటనపట్ల .. సినిమా పట్ల క్రేజ్ పెరిగింది. ఆయనని చూస్తానని కూడా అనుకోని నేను .. ఆయనతో కలిసి నటించాను. అంతకి మించిన అదృష్టం ఏవుంటుంది?' అని చెప్పుకొచ్చాడు.       
srikanth
ali

More Telugu News