తన రిటైర్మెంట్ గురించి స్పందించిన యువరాజ్ సింగ్
- గతేడాది జులై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లోనూ ఆడని యువీ
- ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నా-యువరాజ్
- 2019 ప్రపంచకప్ తరువాత రిటైర్మెంట్
2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు యువరాజ్ సింగ్ చెప్పాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం 2019 ప్రపంచ కప్ తరువాతే ప్రకటిస్తానని తెలిపాడు. తన కెరీర్ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగిందని, అనంతరం టెస్టు మ్యాచ్లో అవకాశాలు రాలేదని అన్నాడు. సరిగ్గా వాటిల్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు కేన్సర్ చికిత్స తీసుకుంటున్నానని, ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదని అన్నారు.