కాఫీ అనుష్కే చేసిందా?: కోహ్లీకి నెటిజన్ల ప్రశ్నలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాఫీ అనుష్కే చేసిందా?: కోహ్లీకి నెటిజన్ల ప్రశ్నలు

  • ఇంట్లో సేదదీరుతున్న కోహ్లీ
  • ఇంట్లో కాఫీ తాగుతున్నాను, చాలా బాగుంది
  • ఢిల్లీ ఇంట్లో ఉన్నావా? లేక ముంబై ఇంట్లో ఉన్నావా?
భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీలంకతో జరుగనున్న సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఇంట్లో సేదదీరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఫోటోను నెటిజన్లతో కోహ్లీ పంచుకున్నాడు. కాఫీ పట్టుకుని పోజిచ్చిన కోహ్లీ.. ‘ఇంట్లో కాఫీ తాగుతున్నాను. చాలా బాగుంది’ అని పేర్కొన్నాడు. దీంతో 'ఈ కాఫీ అనుష్క నీకోసం చేసిందా?, కోహ్లీ! ఇంతకీ నువ్వు ఢిల్లీ ఇంట్లో ఉన్నావా? లేక, ముంబై ఇంట్లో ఉన్నావా?' అంటూ వరస ప్రశ్నలు సంధించారు.      
Virat Kohli
Cricket

More Telugu News