నా సోదరుడు ఇంకా బతికుండటానికి శ్రీదేవే కారణం!: కంటతడి పెడుతున్న అంధ అభిమాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సోదరుడు ఇంకా బతికుండటానికి శ్రీదేవే కారణం!: కంటతడి పెడుతున్న అంధ అభిమాని

  • నా సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉండేది
  • శ్రీదేవికి చెప్పగానే రూ. లక్ష చెక్ ఇచ్చారు
  • శ్రీదేవి సినిమాలు చూడలేకపోయినా.. ఆమె మనసును చూశా
శ్రీదేవి మరణవార్త వినగానే ఆ అభిమాని గుండె పగిలిపోయింది. వెంటనే ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబై బయల్దేరి వచ్చేశాడు అతను. అతని పేరు జతిన్ వాల్మీకి. కళ్లు కనిపించవు. అంధుడు. గత మూడు రోజులుగా శ్రీదేవి నివాసం వద్దే వేచి చూస్తున్నాడు.

'నేను అంధుడిని. అందువల్ల శ్రీదేవి సినిమాలను చూడలేకపోయాను. కానీ ఆమె మంచితనాన్ని మాత్రం చూశాను. ఓ కార్యక్రమం సందర్భంగా ఆమెను కలుసుకున్నా. నా సోదరుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని ఆమెకు చెప్పా. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా రూ. 1 లక్ష చెక్ ఇచ్చారు. శ్రీదేవి సాయం చేసిందన్న విషయం తెలుసుకున్న హాస్పిటల్ యాజమాన్యం ఫీజులో మరో లక్ష తగ్గించింది. ఆమె కారణంగానే ఇప్పటికీ నా సోదరుడు ప్రాణాలతో ఉన్నాడు. అంతగొప్ప మనిషి ఇకలేదని తెలవగానే... కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చా. ఈ విధంగానైనా కృతజ్ఞతలు తెలుపుకుంటా' అంటూ ఎంతో ఆవేదనతో చెప్పాడు.
sridevi
fans
blind fan

More Telugu News