నేటి నుంచి ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- ఏపీలో 1423 , తెలంగాణలో 1294 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం
- రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ పరీక్షలు నేటి నుంచి మార్చి 17వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఏపీలో ఈ ఏడాది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘ఐపె సెంటర్ లొకేటర్’ అనే యాప్ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో విద్యార్థులు సులభంగా తెలుసుకోగలుగుతారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.