సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నితిన్ సినిమాలో రాశిఖన్నా 
  • తెలుగులో మలయాళ 'ఆనందం'!
  • తమిళం నేర్చుకుంటోన్న శృంగారతార
*  నితిన్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు 'శ్రీనివాస కల్యాణం' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో కథానాయికగా మేఘా ఆకాష్ ని తీసుకున్నట్టు ఇంతకుముందు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఆమె స్థానంలో రాశిఖన్నాను ఎంచుకున్నట్టు సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నందితా శ్వేత నటిస్తుంది.    
*  మలయాళంలో నాలుగు కోట్లతో నిర్మించిన 'ఆనందం' చిత్రం భారీ విజయాన్ని సాధించి, 20 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.  
*  బాలీవుడ్ శృంగారతార సన్నీలియోన్ ఇప్పుడు తమిళం నేర్చుకుంటోంది. దర్శకుడు వడివుడియాన్ దర్శకత్వంలో రూపొందే తమిళ చిత్రంలో సన్నీ వారియర్ క్వీన్ గా నటిస్తోంది. ఇందుకోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం కూడా నేర్చుకుంటోంది. పనిలోపనిగా డైలాగులు బాగా అర్థం కావడానికి తమిళం కూడా నేర్చుకుంటోందట.   
Rashi Khanna
nitin
Sunny Leone

More Telugu News