Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్దమ్మాయి నాతో సన్నిహితంగా వుంటుంది.. చిన్నది నాన్న కూచి!: పిల్లల గురించి శ్రీదేవి

  • శ్రీదేవికి జాన్వి, ఖుషీ కుమార్తెలు
  • జాన్వి నాలాగే అణకువగా ఉంటుంది
  • ఖుషీ వాళ్ల నాన్న పార్టీ
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరు నాన్నకు.. మరొకరు అమ్మకు ఎక్కువగా ముద్దవుతారు. శ్రీదేవి అమ్మాయిల విషయంలో కూడా ఈ ముద్దుముచ్చట వుంది. ఈ విషయాన్ని శ్రీదేవే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. గత మాతృత్వ దినోత్సవంనాడు శ్రీదేవిని మీడియా ఇంటర్వ్యూ చేసినప్పుడు... చిన్నమ్మాయి ఖుషీ డాడీ పార్టీ అని, పెద్దమ్మాయి జాన్వీకి తన అవసరం ఎక్కువని, తనతో ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని చెప్పారు.

జాన్వీ తనలాగే అణకువగా, నెమ్మదిగా ఉంటుందని ఆమె చెప్పారు. అయితే ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనేది లేదని, ఇద్దర్నీ ఒకేలా పెంచుతామని అన్నారు. ఇద్దరమూ పిల్లల పెంపకంలో శ్రద్ధ తీసుకుంటామని ఆమె చెప్పారు. తన పిల్లలిద్దరూ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరని ఆమె స్పష్టం చేశారు.
Sridevi
janvi
khushi

More Telugu News