కొప్పుల ఈశ్వర్ కారును ఢీకొన్న మరో వాహనం

తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఉదయం ఆయన కరీంనగర్ బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో.. ఆయన కారును మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వేరే వాహనంలో ఆయనను అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, పలువురు టీఆర్ఎస్ నేతలు ఆయనకు ఫోన్ చేసి, క్షేమసమాచారాలు కనుక్కుంటున్నారు. 


More Telugu News