Andhra Pradesh Weather: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు

Andhra Pradesh Weather Alert Thunderstorms Expected in Several Districts
షార్ట్స్‌లో చూడండి
ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు. ఈ సమయంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మరో వైపు రాబోయే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్ష సూచన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్ డీఎంఏ) ప్రజలను, ముఖ్యంగా రైతులను అప్రమత్తం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది.
Go Back to Shorts
Andhra Pradesh Weather
AP Weather
Amaravati Meteorological Center
Rayalaseema
Coastal Andhra
Thunderstorms
Lightning strikes
Heatwave alert
APSDMA
Farmers safety

More Telugu News