శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న బోనీకపూర్.. దేశాన్నే ‘సర్‌ప్రైజ్’ చేసిన అతిలోక సుందరి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేద్దామనుకున్న బోనీకపూర్.. దేశాన్నే ‘సర్‌ప్రైజ్’ చేసిన అతిలోక సుందరి!

  • శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఏర్పాటు చేసిన బోనీకపూర్
  • నిద్రలేపి 15 నిమిషాలపాటు ముచ్చట్లు
  • రెడీ అయేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లి కుప్పకూలిన నటి
శ్రీదేవి హఠాన్మరణానికి ముందు భర్త బోనీ కపూర్ ఆమెను ‘సర్‌ప్రైజ్’ చేద్దామనుకున్నాడట. అయితే శ్రీదేవి మాత్రం భర్తతోపాటు అశేష ప్రేక్షకాభిమానులకు ‘సర్‌ప్రైజ్’ ఇస్తూ కానరాని లోకాలకు తరలిపోయింది. మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ చేరుకున్న శ్రీదేవి దంపతులు అక్కడి జుమీరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో బస చేశారు. ఆ రాత్రికి శ్రీదేవికి అద్భుతమైన డిన్నర్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామని భర్త బోనీ భావించాడట. ఈ విషయం ఆమెకు ముందే చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. డిన్నర్‌కు ముందు నిద్రపోతున్న శ్రీదేవిని లేపి 15 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత రెడీ అయేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లిన శ్రీదేవి పావుగంటైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన బోనీకపూర్ వాష్‌రూమ్ వద్దకు వెళ్లి తలుపు కొట్టారు. లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బలవంతంగా డోర్ తెరిచారు. లోపల శ్రీదేవి బాత్‌టబ్‌లో అచేతనంగా పడి ఉండడంతో లేపడానికి ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే స్నేహితులను పిలిచారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు, పోలీసులు వచ్చే లోపే శ్రీదేవి తుదిశ్వాస విడిచినట్టు బోనీ కుటుంబ సన్నిహితుల ద్వారా తెలిసింది.
Boney Kapoor
Sridevi
surprise
dinner

More Telugu News