Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాకీ పట్టుకుని వ్యానులో వచ్చి.. ట్రంప్ నివాసంలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన మహిళ

  • వైట్ హౌస్ తనదేనని, డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త అని విచిత్ర వ్యాఖ్యలు
  • అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • ఆమె ఆరోగ్యంగానే ఉందని కోర్టుకు చెప్పిన న్యాయవాది
ఓ మ‌హిళ వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తూ.. తుపాకి పట్టుకుని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి దూసుకెళ్లడానికి ప్ర‌య‌త్నించింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఆమె టెన్నిస్సే రాష్ట్రానికి  చెందిన జెస్సికా ఫోర్డ్‌ (35) అనే మహిళ అని పోలీసులు చెప్పారు. వ్యాన్‌లో దూసుకొచ్చిన ఆమెను తుపాకీ పడేయమని కోరామని, ఆమె అందుకు ఒప్పుకోలేదని, దీంతో అరెస్టు చేశామని చెప్పారు.

ఆమె ఇలా ప్రవర్తించడం మొదటి సారి కాదని, గతంలో కూడా ఓ సారి వైట్ హౌస్‌లోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిందని వివరించారు. వైట్ హౌస్ తనదేనని, డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే భర్త అని విచిత్ర వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. తన పిల్లలు కనిపించకుండా పోయారని, తన పిల్లలను వెతికి పెట్టాలని ఆమె అంటోందని తెలిపారు.

ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఆమెకు కొన్ని రోజులు కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినప్పటికీ ఆమె మారలేదని పోలీసులు అన్నారు.
gun
Donald Trump
white house

More Telugu News