ఆ సినిమాలో మ‌హేశ్ బాబు చెప్పే ఈ డైలాగు శ్రీదేవిని గుర్తు చేస్తూ క‌న్నీరు పెట్టిస్తోంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సినిమాలో మ‌హేశ్ బాబు చెప్పే ఈ డైలాగు శ్రీదేవిని గుర్తు చేస్తూ క‌న్నీరు పెట్టిస్తోంది!

  • శ్రీదేవి గురించే నెటిజన్ల చర్చలు
  • గతంలో పలు సినిమాల్లోనూ శ్రీదేవిని ప్రశంసిస్తూ డైలాగులు
  • 'అతిథి' సినిమాలో మహేశ్‌ బాబు చెప్పిన డైలాగు వైరల్‌
హిందీతో పాటు దక్షిణాది భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన విషయాలను అభిమానులు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఆమె గురించి చాలా సినిమాల్లోనూ చాలా మంది హీరోలు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆ వీడియోలను శ్రీదేవి అభిమానులు వెతికి మ‌రీ చూస్తున్నారు.

'అతిథి' సినిమాలో మహేశ్‌ బాబు కూడా త‌నకు ఇష్ట‌మైన అమ్మాయి.. శ్రీదేవేన‌ని అంటాడు. హీరోయిన్ అమృత‌రావ్ తో ఆ సినిమాలో మహేశ్ బాబు మాట్లాడుతూ... తాను ఒక‌రిని ప్రేమించాన‌ని అంటాడు. చాలా ఆత్రుతతో హీరోయిన్.. నువ్వు ప్రేమించే సుంద‌రి ఎవ‌ర‌ని అడ‌గ‌గా.. మహేశ్ ఆమెకు స‌మాధానం చెబుతూ శ్రీదేవని చెబుతాడు. సోష‌ల్ మీడియాలో మ‌హేశ్ బాబు చెప్పే ఈ డైలాగు అతిలోక సుంద‌రి శ్రీదేవిని గుర్తు చేస్తూ క‌న్నీరు పెట్టిస్తోంది. 
Sridevi
Mahesh Babu
Viral Videos

More Telugu News