'నేను నవ్విస్తే ఆమె ఇంతగా ఏడిపించింది.. శ్రీదేవి గురించి ఇదే నా చివరి ట్వీట్‌'.. అంటూ వీడియో పోస్ట్ చేసిన వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నేను నవ్విస్తే ఆమె ఇంతగా ఏడిపించింది.. శ్రీదేవి గురించి ఇదే నా చివరి ట్వీట్‌'.. అంటూ వీడియో పోస్ట్ చేసిన వర్మ

  • ఇప్పటి నుంచి తను ఇంకా బతికి ఉందనే ఊహించుకుంటాను
  • శ్రేదేవీ నన్నింత ఏడిపించడం అన్యాయం 
  • ఇంకెప్పటికీ మీతో మాట్లాడను.. జీవితాంతం కటీఫ్- వర్మ
తాను సినీ నటి శ్రీదేవిని ఎంతగానో ఆరాధిస్తానని గతంలో చాలాసార్లు చెప్పుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదయం నుంచి ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవి గురించి ఇదే తన చివరి ట్వీటని పేర్కొంటూ.. గతంలో ఓ టీవీ కార్యక్రమంలో శ్రేదేవితో కలిసి పాల్గొన్న వీడియోను పోస్ట్ చేశారు.

'శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికి ఉందనే ఊహించుకుంటాను. శ్రేదేవీ గారూ, నేను మిమ్మల్ని ఇంత నవ్వించా.. మీరు ఇప్పుడు నన్నింత ఏడిపించడం అన్యాయం, ఇంకెప్పటికీ మీతో మాట్లాడను.. జీవితాంతం కటీఫ్' అని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
RGV
sridevi
Twitter

More Telugu News