Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీదేవి మరణ వార్తతో షాక్ కు గురైన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్

  • మనమంతా ఆమెను చూస్తూనే పెరిగాం
  • ఇక ఆమె లేరన్న వార్త కష్టంగా ఉంది
  • ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
దిగ్గజ నటీమణి శ్రీదేవి మరణ వార్తపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. శ్రీదేవి దుబాయిలో నిన్న రాత్రి 11 గంటల తర్వాత తీవ్ర స్థాయిలో వచ్చిన గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీనిపై టెండూల్కర్ స్పందిస్తూ... నిజంగా ఇది చాలా బాధాకరం. నేను నిద్రలేచిన తర్వాత ఈ వార్త విని కలత చెందా. నిజంగా బాధాకరం. నాకు మాటలు రావడం లేదు. ఎందుకంటే మనమంతా ఆమెను చూస్తూనే పెరిగాం. ఉన్నట్టుండి ఆమె ఇక లేరన్న వార్త వినడం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది’’ అని టెండుల్కర్ ఈ రోజు ఢిల్లీలో ఐడీబీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, ఆమెను అభిమానించే, ప్రేమించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
actor sridevi
Sachin Tendulkar

More Telugu News