కేఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉంది: కంగాటి శ్రీదేవి
- కేఈ శ్యాంబాబు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
- పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
- హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి
ఈ వ్యవహారంపై తాము డోన్ కోర్టుకు వెళ్లగా... కేసులో వీరందరినీ ముద్దాయిలుగా చేర్చి, అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. అయితే, శ్యాంబాబుకు హైకోర్టులో స్టే వచ్చినట్టు ఓ పత్రికలో ప్రచురించారని... అది వాస్తవం కాదని తెలిపారు. ఒకవేళ హైకోర్టులో స్టే వచ్చినా, తాము సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని... నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.