క్రిష్ - వరుణ్ తేజ్ మూవీకి భారీ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రిష్ - వరుణ్ తేజ్ మూవీకి భారీ ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు

  • క్రిష్ నిర్మాణంలో వరుణ్ తేజ్ 
  • దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి 
  • అప్పుడే పూర్తయిన ఓవర్సీస్ బిజినెస్
హిందీలో 'మణికర్ణిక' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్న దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డితో కలిసి తెలుగులో ఒక సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందనుంది. క్రిష్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది. ఆయన నిర్మిస్తోన్న ఈ సినిమాకి కూడా అక్కడ మంచి డిమాండ్ ఉందట.

 అందువల్లనే ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 2.75 కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. ఇక గతంలో సంకల్ప్ రెడ్డి చేసిన 'ఘాజీ' సినిమా కూడా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ కారణంగా కూడా ఓవర్సీస్ రైట్స్ ఈ రేటుకు అమ్ముడైనట్టు చెబుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు 18 కోట్లను ఆఫర్ చేశారనేది తాజా సమాచారం. కంటెంట్ పై గల నమ్మకమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు.        
krish
varun tej

More Telugu News