ఆర్థిక సాయం కోసం పరుగుల రారాణి పీటీ ఉష వినతి!
- ఉష స్కూల్ నిర్వహణకు సాయం కోసం ట్విట్టర్ సందేశం
- పేద బాలికలకు ఉచితంగా శిక్షణ
- ఏషియాడ్, ఒలింపిక్స్ పోటీలే లక్ష్యంగా కృషి
ఏసియాడ్, ఒలింపిక్స్లకు అద్భుతమైన స్ప్రింటర్లను తయారు చేసే లక్ష్యంతో పీటీ ఉష 2002లో కేరళలోని కోజీకోడ్‌లో తన పేరుమీదే ఓ స్కూల్‌ను నెలకొల్పారు. ఇందులో పేద బాలికలకు ఉచితంగా శిక్షణ, ఆహారం, వసతి ఏర్పాట్లు కల్పిస్తారు. గతేడాది వరకు ఈ స్కూల్ ప్రభుత్వ గ్రాంట్లు, సంస్థలు, కొంత మంది దాతల విరాళాలతో నడిచింది. అయితే ఇప్పుడు నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆమె సోషల్ మీడియా ద్వారా అశేష అభిమానులకు, దాతలకు, సహృదయులకు ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేశారు. క్రీడలకు ఆమె చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ, అర్జున అవార్డులను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.