Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా తోటి వాళ్ల మాదిరిగా స్టార్ కమెడియన్ కాలేకపోయినందుకు బాధగానే ఉంటుంది: కమెడియన్ వేణు

  • ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వున్నాను 
  • అయినా స్టార్ కమెడియన్ కాలేదు 
  • సరైన పాత్ర కోసం .. టైమ్ కోసం ఎదురుచూస్తున్నాను
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో వేణు కూడా కనిపిస్తుంటాడు. తాజాగా ఐ డ్రీమ్స్ తో ఆయన మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. " ఏంట్రా ఇంత కష్టపడుతున్నాను ..  ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో వున్నాను .. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లు పైకెళ్లిపోతున్నారు .. నాకు ఇంకా స్టార్ డమ్ రావడం లేదని వేణు ఫీలవుతూ ఉంటాడని అంటూ వుంటారు .. నిజమేనా ?" అనే ప్రశ్న వేణుకు ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. " అలా అనుకోవడంలో తప్పులేదుగా .. ఎందుకు నేను స్టార్ కమెడియన్ కాలేకపోతున్నాను .. ఎక్కడ పొరపాటు జరుగుతోంది? .. ఏం చేయాలి? అని ఆలోచిస్తూ వుంటాను. వెన్నెల కిషోర్ .. శ్రీనివాస్ రెడ్డి .. సప్తగిరి స్టార్ కమెడియన్స్ అయ్యారు. ఆ రేంజ్ కి నేను ఇంకా రాలేదు.. అందువలన ఆ బాధ ఉంటుంది. వాళ్ల మాదిరిగా నాకు సరైన పాత్రలు పడాలి .. ఆ టైమ్ రావాలి అనుకుంటాను" అంటూ చెప్పుకొచ్చాడు.  
venu

More Telugu News