దెయ్యమని తెలియక ప్రేమిస్తే... 'రా...రా' స్టోరీ లైన్ చెప్పిన శ్రీకాంత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దెయ్యమని తెలియక ప్రేమిస్తే... 'రా...రా' స్టోరీ లైన్ చెప్పిన శ్రీకాంత్

  • శ్రీకాంత్ 125వ చిత్రంగా 'రా...రా'
  • నేడు వెండితెరపైకి వచ్చిన చిత్రం
  • దర్శకుడి పేరును వెల్లడించని యూనిట్
తన కెరీర్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వివిధ రకాల పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు శ్రీకాంత్, తన 125వ చిత్రంగా 'రా...రా'లో నటించగా, ఆ సినిమా నేడు వెండితెరలను తాకింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీకాంత్, ఈ చిత్రాన్ని పెద్ద పేరున్న డైరెక్టర్ తీశారని, అయితే ఆయన కోరిక మేరకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన పేరును బయట పెట్టరాదని తాము నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. సినిమాకు నిర్మాతే ముఖ్యమని అన్నాడు.

 ఇక మూవీ కథ గురించి చెబుతూ, తాను ఈ చిత్రంలో సినీ దర్శకుడి పాత్రను పోషిస్తున్నానని, తెలియక ఓ దెయ్యాన్ని ప్రేమించిన తరువాత ఏం జరిగిందన్న విషయాన్ని కామెడీ జోడిస్తూ తీశారని చెప్పాడు. సినిమాలో మూడే పాటలు ఉంటాయని ర్యాప్ రాక్ షకీల్ మంచి సంగీతాన్ని అందించాడని వెల్లడించాడు. తాను తొలిసారిగా కామెడీ జోడించిన హారర్ జోనర్ ను టచ్ చేశానని, ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అభిప్రాయపడ్డాడు.
Ra...Raa
Srikant
Movie
Tollywood

More Telugu News