అధికారులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి: మంత్రి సోమిరెడ్డి
- అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు
- గతంలో జగన్ కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేశారు
- మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలది కూడా ఇదే తీరు
- కేసులపై విచారణ ముమ్మరం అవుతున్నందుకే ఇలా చేస్తున్నారు
అధికారులపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగన్మోహన్రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో జగన్ కూడా అధికారులను బ్లాక్ మెయిల్ చేశారని సోమిరెడ్డి మండిపడ్డారు. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలది కూడా ఇదే తీరని అన్నారు.