ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మా అమ్మకు చెప్పేశాను: సాయిధరమ్ తేజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మా అమ్మకు చెప్పేశాను: సాయిధరమ్ తేజ్

  • మా అమ్మ నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది
  • బాగానే సంపాదిస్తున్నావ్ కదా చేసుకో అంది 
  • నా మనసులో మాటను గట్టిగా చెప్పేశాను
ఒక వైపున వరుస పరాజయాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ, అవకాశాలను అందుకోవడంలో సాయిధరమ్ తేజ్ దూకుడు ఎంతమాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన పెళ్లి గురించిన ప్రస్తావన తెచ్చాడు. రీసెంట్ గా మా అమ్మ "పెళ్లి చేసుకోరా .. నీకు వయసొచ్చింది .. బాగానే సంపాదిస్తున్నావ్ .. చేతిలో నాలుగు సినిమాలు వున్నాయ్" అంది.

 'నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను .. చిన్నప్పుడు .. చదువుకునే వయసులో నేను ఏవైతే మిస్సయ్యానో వాటిని పొందాలనుకుంటున్నాను. నీ కోసం ..  ఫ్రెండ్స్ కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. జీవితాన్ని ఇంకొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేశాను" అంటూ నవ్వేశాడు. ఈ మెగా హీరో పెళ్లి కోసం అభిమానులు ఇంకొంత కాలం వెయిట్ చేయవలసిందేనన్నమాట.
sai dharam tej

More Telugu News