'అహం బ్రహ్మాస్మి' టైటిల్ వెనుక అసలు కథ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అహం బ్రహ్మాస్మి' టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

  • 'అహం బ్రహ్మాస్మి' వరుణ్ తేజ్ కోసం కాదు 
  • క్రిష్ తదుపరి సినిమా కోసం 
  • రెండు సినిమాల నిర్మాతలు ఒకరే 
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందనుంది. 'అంతరిక్షం' నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా నిన్న వార్తలు వచ్చాయి. సంకల్ప్ రెడ్డి సిద్ధం చేసుకున్న కంటెంట్ కి .. ఎంచుకున్న టైటిల్ కి సంబంధం లేదనే సందేహం తలెత్తింది. అయితే ఏదో సంబంధం వుండే ఉంటుందని సరిపెట్టుకున్నారు.

కానీ నిజంగానే ఈ కథకీ .. టైటిల్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న రాజీవ్ రెడ్డి .. జాగర్లమూడి సాయిబాబు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో ఇలా ప్రచారం జరిగింది. వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించింది క్రిష్ తదుపరి సినిమా కోసమనేది తాజా సమాచారం. వెంకటేశ్ హీరోగా క్రిష్ ఒక సినిమా చేసే అవకాశం వుంది .. ఈ సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.     
krish
venkatesh

More Telugu News