వేరే దేశాల్లో అయితే రామ్ గోపాల్ వర్మను షూట్ చేసి పారేస్తారు: ఐద్వా మహిళ మణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేరే దేశాల్లో అయితే రామ్ గోపాల్ వర్మను షూట్ చేసి పారేస్తారు: ఐద్వా మహిళ మణి

  • రెండు రాష్ట్రాల మహిళల ఆత్మగౌరవాన్ని వర్మ కించపరిచారు
  • దుర్మార్గంగా మాట్లాడుతున్న వర్మను ఎలా వదిలేస్తాం?
  • ఎవడండీ ఈ రామ్ గోపాల్ వర్మ? వైజాగ్ రమ్మనమనండి సంగతి చెబుతాం!
  • చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? :  మణి మండిపాటు
తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తగిన శిక్ష పడాలని, అంత వరకూ తన పోరాటం కొనసాగిస్తానని ఐద్వా మహిళ మణి అన్నారు. ఈ నేపథ్యంలో ‘టీవీ 9’ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ‘విజయవాడలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులు, రాజకీయ నాయకులు, అఖిల పక్ష కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు... రాష్ట్రంలో ఎన్ని సంఘాలు వున్నాయో అన్ని సంఘాలనూ రేపు పిలుస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశంలో అల్టిమేటమ్ జారీ చేస్తాం. లేకపోతే, మేమంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారికి మా సమస్యను విన్నవించాం. విజయవాడ సిటీ కమిషనర్ యోగా నంద్ గారితో ఈ విషయమై మాట్లాడి కేసు నమోదు చేస్తామని నన్నపనేని మాతో చెప్పారు. అయితే, నేను పదిసార్లు ఆమెకు ఫోన్ చేశాను. ‘అమ్మా, నేను చాలా బిజీగా ఉన్నాను.. చేసేస్తానమ్మా’ అంటూ చెప్పుకొచ్చారు.

రెండు రాష్ట్రాల మహిళల ఆత్మగౌరవాన్ని రామ్ గోపాల్ వర్మ కించపరిచారు. ఆ పోర్న్ సినిమాకు మార్కెటింగ్ కోసం అందరినీ ఉపయోగించుకున్నారు. యువతను పక్కదారి పట్టించారు. ఆ సినిమాకు లాభాలు దండుకున్నాడు. ఈ చిత్రం పర్యవసానం అనుభవించేది ఎవరు? రాష్ట్రంలో ఉన్న మహిళలు, పిల్లలు. ఈ సమస్య పెద్ద సమస్య కాదా? అని మేడమ్ గారిని (నన్నపనేని రాజకుమారి) ప్రశ్నిస్తున్నాను.

ఎంతో దుర్మార్గంగా మాట్లాడుతున్న రామ్ గోపాల్ వర్మను ఎలా వదిలేస్తాం? క్షమాపణలు చెప్పాను కనుక, ఊరుకోండి అని అంటున్నాడు. ఎవడండీ, ఈ రామ్ గోపాల్ వర్మ? వైజాగ్ రమ్మనమనండి సంగతి చెబుతాం! చంద్రబాబు, నన్నపనేని రాజకుమారి ఎందుకు చర్యలు తీసుకోరు? అసలు, భారతదేశంలో ఉన్నామా? వేరే దేశాల్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది. వేరే దేశాల్లో అయితే రామ్ గోపాల్ వర్మ లాంటి వాడిని షూట్ చేసి పారేస్తారు! మన దేశంలో కాబట్టి, సహనం ఎక్కువైపోయి, చట్టాలు ఎక్కువైపోయి, అందులో లూప్ హోల్స్ ఎక్కువైపోయి అయ్యగారు (వర్మ) లాంటి వాళ్లు ఊరు మీద తిరుగుతున్నారు’ అంటూ మణి మండిపడ్డారు.
Tollywood
ram gopal varma
idwa
mani

More Telugu News