నటుడు మోహిత్ మార్వా వివాహంలో శ్రీదేవి కుటుంబం సందడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడు మోహిత్ మార్వా వివాహంలో శ్రీదేవి కుటుంబం సందడి

  • బోనీకపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్
  • యూఏఈలో మోహిత్ మార్వా వివాహం
  • ఈ వివాహానికి హాజరైన బాలీవుడ్ తారలు
బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహంలో బోనీకపూర్ - శ్రీదేవి కుటుంబం సందడి చేసింది. బోనీకపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ ల సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహం యూఏఈలో నిన్న ఘనంగా జరిగింది.

మోహిత్ తన ప్రియురాలు మోతీవాలాను వివాహమాడిన ఈ వేడుకకు బోనీ కపూర్ - శ్రీదేవి, వీరి చిన్న కుమార్తె ఖుషి, బాలీవుడ్ నటులు కరణ్ జొహార్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, బాలీవుడ్ నటి సోనమ్, ఆమె కుటుంబ సభ్యులు, బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజా తదితరులు హాజరయ్యారు. కాగా, నవ దంపతులతో కలిసి దిగిన ఫొటోలను శ్రీదేవి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచారు.  
Bollywood
sridevi

More Telugu News