ఇమ్రాన్ ఖాన్ పచ్చిమోసగాడు, వివాహేతర సంబంధాల్లో ఆరితేరిపోయాడు: మాజీ భార్య రేహమ్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇమ్రాన్ ఖాన్ పచ్చిమోసగాడు, వివాహేతర సంబంధాల్లో ఆరితేరిపోయాడు: మాజీ భార్య రేహమ్ ఖాన్

  • ఇమ్రాన్ ఖాన్ ఆదివారం మూడో వివాహం చేసుకున్నట్టు ప్రకటించిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ
  • నెలన్నర క్రితమే వారి వివాహం జరిగిందన్న ఇమ్రాన్ రెండో మాజీ భార్య
  •  ఇమ్రాన్ నీతిమాలిన వ్యక్తని తిట్టిపోసిన వైనం 
గత ఆదివారం ముచ్చటగా మూడో పెళ్లిచేసుకున్న మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పై రెండో మాజీ భార్య రేహమ్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ ఖాన్ మూడో వివాహం నేపథ్యంలో ‘టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇమ్రాన్  పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించింది.

తాను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉందని ఆమె కుండబద్దలుకొట్టింది. తన ముందే ఇమ్రాన్ ఆమెతో చనువుగా ఉండేవాడని వెల్లడించింది. అందుకే పెళ్లయ్యాక 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశానని చెప్పింది.

గత ఆదివారం ఇమ్రాన్‌ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించినప్పటికీ, వాస్తవానికి వారి వివాహం జరిగి నెలన్నర అవుతోందని తెలిపింది. గతంలో తన వివాహ సమయంలో కూడా ఇలానే జరిగిందని ఆమె చెప్పింది. తామిద్దరం వివాహం చేసుకున్న రెండు నెలల తరువాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారని ఆమె వెల్లడించింది. ఇమ్రాన్‌ ఖాన్ లాంటి నీతిమాలిన వ్యక్తిని తన జీవితంలో ఇంతవరకు చూడలేదని రేహమ్‌ ఖాన్ పేర్కొంది.  
imran khan
bushra
reham khan
marriage

More Telugu News