సైనికులతో కలసి బన్నీ వాలీబాల్.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైనికులతో కలసి బన్నీ వాలీబాల్.. వీడియో ఇదిగో!

  • భారత్-పాక్ సరిహద్దుల్లో ‘నా పేరు సూర్య..’ చిత్రీకరణ
  • సైనికులతో వాలీబాల్ ఆడిన అల్లు అర్జున్
  • ఓ వీడియో పోస్ట్ చేసిన బన్నీ
వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రంలో మిలిటరీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తుండగా, అతని సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ భారత్-పాక్ సరిహద్దుల్లో జరుగుతోంది. కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కాగా, ఇటీవల షూటింగ్ లేని సమయంలో అల్లు అర్జున్ సరదాగా గడిపాడు. ఇండియన్ ఆర్మీ సైనికులతో కలసి బన్నీ వాలీబాల్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. చిత్రయూనిట్ తో పాటు ఆర్మీ సిబ్బంది ఈ గేమ్ ను ఆసక్తిగా తిలకిస్తుండటం ఈ వీడియోలో మనకు కనపడుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ‘స్టైల్ కా బాప్’, ‘ఫస్ట్ అండ్ లాస్ట్ యాక్షన్ హీరో’, లవ్లీ సూపర్ స్టార్’, ‘మోస్ట్ ఎట్రాక్టివ్’ అంటూ అభిమానులు కితాబిచ్చారు.<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FAlluArjunArmyOfficial%2Fvideos%2F425191407925478%2F&show_text=1&width=261" width="261" height="755" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>
Tollywood
Allu Arjun

More Telugu News