మాపై ఆ విమర్శ రావడంలో అర్థం వుంది .. అందుకు కారణం అదే: 'జబర్దస్త్' గెటప్ శీను
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాపై ఆ విమర్శ రావడంలో అర్థం వుంది .. అందుకు కారణం అదే: 'జబర్దస్త్' గెటప్ శీను

  • ఒక వైపున సుధీర్ బిజీ అయ్యాడు 
  • మరో వైపున రామ్ ప్రసాద్ కి అవకాశాలు పెరిగాయి
  • నేను చేసే షోలు కూడా పెరిగాయి   
'జబర్దస్త్' స్టేజ్ పై నవ్వులు కురిపించే టీమ్స్ లో సుడిగాలి సుధీర్ టీమ్ ఒకటి. ఆ టీమ్ లో రామ్ ప్రసాద్ .. గెటప్ శీను ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ వుంటారు. కామెడీని పండించే విషయానికొస్తే ఈ మధ్య ఈ బ్యాచ్ ఊపు తగ్గిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రశ్న ఐ డ్రీమ్స్ లో గెటప్ శీనుకి ఎదురైంది.

అందుకాయన స్పందిస్తూ "ఈ విమర్శతో కొంతవరకూ నేను ఏకీభవిస్తున్నాను . . ఏదీ లేకుండగా ఎవరూ విమర్శించరు. ప్రశంసలతో పాటు విమర్శలు కూడా తీసుకోవలసిందే. సుధీర్ ఇప్పుడు నాలుగు షోలు చేస్తున్నాడు .. మరో వైపున సినిమాలు చేస్తున్నాడు. రామ్ ప్రసాద్ విషయానికొస్తే కొన్ని సినిమాలకి రాస్తూ తను బిజీగా వున్నాడు. నేను కూడా కొన్ని షోలు .. సినిమాలు చేస్తున్నాను. ఇలా ముగ్గురం బిజీ కావడం వలన .. ఒక స్కిట్ గురించి కూర్చునే అవకాశం ఉండటం లేదు. ఆ సమయానికి ముగ్గురం మూడు చోట్ల ఉంటున్నాం. మా బ్యాచ్ ఊపు తగ్గడానికి కారణం ఇదే. ఏదేవైనా 'జబర్దస్త్' కోసం మేం కలిసి కష్టపడతాం" అంటూ చెప్పుకొచ్చాడు.          
getap srinu

More Telugu News