Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్' కి సుధీర్ వెళ్లడానికి కారకుడిని నేనే: నటుడు గెటప్ శీను

  • 'జబర్దస్త్'లోకి రమ్మని నన్ను వేణు పిలిచాడు 
  • ఆ సమయంలో నేను .. సుధీర్ రూమ్మేట్స్ 
  • సుధీర్ ను వేణుకి పరిచయం చేశాను 
  • అలా సుధీర్ అక్కడ సెట్ అయ్యాడు
తాజాగా ఐ డ్రీమ్స్ తో గెటప్ శీను మాట్లాడుతూ .. తాను 'జబర్దస్త్' కార్యక్రమానికి పరిచయం కావడానికి దారితీసిన పరిస్థితులను గురించి ప్రస్తావించాడు. " నేను 'జబర్దస్త్'లోకి ఎంటర్ కావడానికి హెల్ప్ చేసింది ఆర్టిస్ట్ వేణు. ఓ సినిమా చేస్తుండగా మా ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగింది. ఆ తరువాత నేను జెమినీ మ్యూజిక్ లో చేస్తుండగా .. ఇలా ఓ కామెడీ షో వుంది చేద్దాం రమ్మని పిలిచాడు.

అప్పటికే చంద్రం .. రాఘవ .. ధన్ రాజ్ నన్ను తమ టీమ్ లోకి రమ్మని పిలిచారు. కానీ వేణు నాకు బాగా పరిచయం కావడం వలన ఆయన టీమ్ లోకి వెళదామని నిర్ణయించుకున్నాను. అయితే నేను పనిచేసే చోట నాకు ఒక ఏడాది అగ్రిమెంట్ వుంది అని వేణుతో చెప్పాను. సరే .. అగ్రిమెంట్ పూర్తికాగానే వచ్చేయ్ అని వేణు అన్నాడు. ఆ సమయంలో నేను .. సుధీర్ రూమ్మేట్స్ గా ఉండేవాళ్లం. దాంతో  నా ఫ్రెండ్ సుధీర్ వున్నాడు .. బాగానే చేస్తాడు అని చెప్పేసి పరిచయం చేశాను. అలా 'జబర్దస్త్'లోకి సుధీర్ వెళ్లిన కొన్నాళ్లకు నేను వెళ్లాను" అంటూ చెప్పుకొచ్చాడు.
getup sreenu

More Telugu News