'అమ్మాయిలూ జాగ్రత్త' అంటూ ఎన్టీఆర్ షార్ట్ ఫిల్మ్... చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అమ్మాయిలూ జాగ్రత్త' అంటూ ఎన్టీఆర్ షార్ట్ ఫిల్మ్... చూడండి!

  • గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్త
  • వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు
  • తప్పు చేస్తే అనుకోని కష్టాలు
  • షార్ట్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ హెచ్చరిక
గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ, వారిలో చైతన్యాన్ని పెంచేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హీరో ఎన్టీఆర్ తో ఓ షార్ట్ ఫిల్మ్ ను తీసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రముఖ థియేటర్లలో నిన్నటి నుంచి ప్రదర్శిస్తుండగా, దాన్నే సోషల్ మీడియాలో సైతం పోలీసులు విడుదల చేశారు. ఫేస్ బుక్ ఫ్రెండ్ నుంచి ఓ యువతికి ఎదురైన అనుభవాన్ని ఇందులో చూపించారు.

ఆమె ఎదుర్కొన్న బాధను ప్రస్తావిస్తూ, ఎన్టీఆర్ "వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయకండి. తగు జాగ్రత్తలను వహించండి. అపరిచిత వ్యక్తులతో ఆన్‌ లైన్ పరిచయాలు అనుకోని కష్టాలకు కారణం కావచ్చు. ధైర్యంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ కు రిపోర్ట్ చేయండి... జాగ్రత్త" అని సందేశం ఇవ్వడంతో ఈ లఘుచిత్రం ముగుస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ ను మీరూ చూడవచ్చు.

NTR
Social Media
Hyderabad
Police
Short Film

More Telugu News