Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీలో మరో ఛాన్స్ దక్కించుకున్న రెజీనా

  • తెలుగులో అంతంత మాత్రంగా అవకాశాలు 
  • తమిళంలో వరుస సినిమాలు 
  • హిందీలో అవకాశాలను దక్కించుకునే ప్రయత్నాలు
తెలుగులో రెజీనాకి మంచి క్రేజ్ వుంది. అయితే ఆ క్రేజ్ ను పెంచే సినిమాలు వెంటవెంటనే పడకపోవడంతో ఆమె కెరియర్ కాస్త మందగించింది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ సినిమాలపై దృష్టిపెట్టి, అక్కడ అవకాశాలను దక్కించుకుంటోంది. పనిలో పనిగా హిందీ సినిమాల్లో ఛాన్స్ కోసం కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

ఆ మధ్య ఆమెకి 'ఆంఖేయిన్ 2' సినిమాలో ఛాన్స్  వచ్చింది. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోవడం ఆమెకి నిరాశను కలిగించింది. బాలీవుడ్ నుంచి ఇప్పుడు ఆమెకి మరో ఛాన్స్ తగిలింది. రాజ్ కుమార్ రావ్ .. అనిల్ కపూర్ .. జుహీ చావ్లా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న 'ఏక్ లడ్కికో దేఖతో ఐసా లగా' సినిమాలో ఆమెకి అవకాశం దక్కింది. చాలామంది కథానాయికలకు ఆడిషన్స్ నిర్వహించిన దర్శకుడు షెల్లీ చోప్రధర్, రెజీనానే ఖరారు చేశాడట. ఈ సినిమాతో అక్కడ రెజీనా మరిన్ని ఛాన్సులు కొట్టేస్తుందేమో చూడాలి.        
regina

More Telugu News