'కొడితే పళ్లు రాలిపోతాయ్' అంటూ షో నుంచి ఆగ్రహంతో లేచి వెళ్లిపోయిన బాలీవుడ్ నటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కొడితే పళ్లు రాలిపోతాయ్' అంటూ షో నుంచి ఆగ్రహంతో లేచి వెళ్లిపోయిన బాలీవుడ్ నటి!

  • సోషల్ మీడియాలో ట్రోల్ కు గురైన జరీన్ ఖాన్
  • వేధిస్తున్న వ్యక్తిని 'ట్రోల్ పోలీస్' కార్యక్రమానికి ఆహ్వానించిన ఎంటీవీ
  • వేధిస్తున్న వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జరీన్ ఖాన్
నటీమణులు, సెలబ్రిటీలపై సామాజిక మాధ్యమాల్లో కొందరు విపరీతమైన వ్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల బాధ భరించలేక కొందరు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల నుంచి నిష్క్రమించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా విపరీత వ్యాఖ్యలు చేసేవారిని సెలబ్రిటీలకు ఎదురుగా కూర్చోబెట్టి సోషల్ మీడియాలో కామెంట్లకు వివరణ కోరే ప్రయత్నాన్ని 'ట్రోల్ పోలీస్' కార్యక్రమం పేరుతో ఎంటీవీ నిర్వహిస్తోంది.

తాజాగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ పై తీవ్రవ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిని, జరీన్ ఖాన్ ను ఆ షోకు ఆహ్వానించింది. షోకు హాజరైన జరీన్ ఖాన్... ఆ వ్యక్తిని చూసిన వెంటనే అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. తీవ్ర ఆగ్రహంతో ‘నా చెయ్యి నీ ముఖం కంటే పెద్దది. కొట్టమంటావా? కొడితే పళ్లు రాలిపోతాయ్‌’ అంటూ తిట్టేసి, షో నుంచి విసురుగా వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని ఎంటీవీ ఇండియా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది.
zarine khan
Social Media
mtv
troll police

More Telugu News