అప్పట్లో చాలా నాజూకుగా కనిపించిన బాలీవుడ్ హీరోయిన్‌.. ఇప్పుడు ఇలా మారిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో చాలా నాజూకుగా కనిపించిన బాలీవుడ్ హీరోయిన్‌.. ఇప్పుడు ఇలా మారిపోయింది!

  • బాలీవుడ్‌లో కల్‌యుగ్‌ చిత్రం (2005)తో సినీ రంగ ప్రవేశం చేసిన స్మైలీ సూరి
  • అనారోగ్యానికి గురై సినిమాలకు దూరం
  • బరువు పెరిగిపోయిన వైనం
బాలీవుడ్‌లో 'కల్‌యుగ్‌' చిత్రం (2005) ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి మంచి పేరు తెచ్చుకుంది స్మైలీ సూరీ. అప్పట్లో ఎంతో నాజూకుగా కనపడిన ఆమె.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అందుకు కారణం ఆమె అనారోగ్యానికి గురికావడమే. ఇప్పుడు బాలీవుడ్‌లో ఈ విషయమే చర్చనీయాశంగా మారింది.

    ప్రస్తుతం ఆమె కాస్త కోలుకుని, పోల్‌ డాన్సర్‌ అవతారం ఎత్తింది. కలియుగ్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆమె.. నాలుగైదు చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌తోనే కనపడింది. 2014లో డాన్సర్‌ వినీత్‌ బంగేరాను ఆమె పెళ్లి చేసుకుంది. ఆమె ప్రముఖ దర్శక నిర్మాత మహేష్‌ భట్‌కు బంధువు. హైపో థైరాయిడిజం కారణంగా విపరీతమైన బరువు పెరిగిపోయింది. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు పలు విషయాలు కూడా చెప్పింది.  
 
పీసీఓడీతో కూడా తాను బాధపడుతున్నానని, తాను గతంలో ఒత్తిడికి లోనై డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది.  


                  (అప్పట్లో హీరోయిన్‌ స్మైలీ సూరి ఫొటో)
smiley
suri
Bollywood

More Telugu News