"నా దురదృష్టం... ఏవీఎస్, ధర్మవరపు, ఎంఎస్... నేడు గుండు... అందరం వెళ్లిపోవాల్సిందే": రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగం
- దాదాపు 50కి పైగా సినిమాల్లో కలసి నటించాం
- సోదరుడి వంటి వాడిని కోల్పోయాను
- మనసుకు నచ్చిన వ్యక్తి గుండు: రాజేంద్ర ప్రసాద్
"నా దురదృష్టం... ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటి వారిని కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు" అని భావోద్వేగంతో మాట్లాడారు.