నీరవ్ మోదీ, ముఖేష్ అంబానీలు దగ్గరి చుట్టాలే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీరవ్ మోదీ, ముఖేష్ అంబానీలు దగ్గరి చుట్టాలే!

  • ముఖేష్ మేనకోడలికి నీరవ్ సోదరుడితో వివాహం
  • నీశాల్ మోదీతో అప్పట్లో అత్యంత వైభవంగా పెళ్లి
  • మంచి పేరు తెచ్చుకున్న నీశాల్
ఇండియాలోని దాదాపు 30 బ్యాంకులను వేల కోట్లకు ముంచేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ గురించి ఆరా తీస్తుంటే, మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి నీరవ్ దగ్గరి బంధువే. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మేనకోడలు (వారి సోదరి దీప్తి, గోవా పారిశ్రామికవేత్త దత్తరాజ్ల కుమార్తె) ఇషిత భర్త నీరవ్ మోదీ సోదరుడు నీశాల్ మోదీ.

అప్పట్లో ఈ పెళ్లిని ముఖేష్ అత్యంత వైభవంగా నిర్వహించారు. వివాహానికి ముందు ట్రైడెంట్ హోటల్ ను మొత్తం బుక్ చేసుకుని పెద్దఎత్తున పార్టీలు ఇచ్చారు. నీశాల్ పలు కంపెనీలు స్థాపించి వాటిని వృద్ధిలోకి తెచ్చి పేరు సంపాదించుకోగా, నీరవ్ బ్యాంకులకు టోకరా ఇచ్చి విదేశాలకు పారిపోయాయి చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
Nirav Modi
Nishal Modi
Mukesh Ambani

More Telugu News