తమిళనాడులో నా పర్యటనను ప్రారంభిస్తున్నట్టు రజనీకి చెప్పా :కమల హాసన్
సూపర్ స్టార్ రజనీకాంత్ ను ప్రముఖ నటుడు కమలహాసన్ మరోమారు కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి కమల్ ఈరోజు వెళ్లారు. భేటీ అనంతరం మీడియాతో కమల్ మాట్లాడుతూ, రజనీకాంత్ ని కలిసింది రాజకీయాల నేపథ్యంలో కాదని, తమిళనాడులో తన రాజకీయ పర్యటన ప్రారంభించనున్న విషయాన్ని ఆయనకు చెప్పేందుకు వచ్చినట్టు చెప్పారు.
తన పర్యటనకు ముందు అందరినీ ఓసారి కలవాలని అనుకున్నానని, ఈ నేపథ్యంలోనే రజనీని కలిసినట్టు చెప్పారు. ఈ నెల 21న తన రాజకీయపార్టీని ప్రకటిస్తున్నానని, స్నేహితులు, శ్రేయోభిలాషులను కలుస్తున్నానని, ఇందులో ఎలాంటి రాజకీయకోణం లేదని స్పష్టం చేశారు. గతంలో కూడా చాలా మంది ప్రముఖులను తాను కలిశానని, రజనీకాంత్ తన ప్రాణమిత్రుడని, అందుకే, కలిశానని పేర్కొన్నారు.