నా భర్త ఇంటికి వస్తున్నాడంటే భయంతో వణికిపోయేదాన్ని: సింగర్ కౌసల్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా భర్త ఇంటికి వస్తున్నాడంటే భయంతో వణికిపోయేదాన్ని: సింగర్ కౌసల్య

  • పెళ్లి ఆశలు తొలి నాళ్లలోనే ఆవిరైపోయాయి
  • భార్యను కొట్టేవాడు భర్తెలా అవుతాడు?
  • ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావని హింసించాడు
  • భర్త దుర్మార్గాల గురించి గాయని కౌసల్య
మదినిండా ఆశలతో పుట్టింటి నుంచి అత్తింట్లో కాలుమోపిన నవ వధువును... భరోసా ఇస్తాయని అనుకున్న భర్త చేతులే నరకం చూపిస్తే... గృహహింసను అనుభవించే వారిలో ఆమాయక యువతులే కాదు. సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తన గాన మాధుర్యంతో ఎంతో మంది మనసులను ఆహ్లాదపరిచే ప్రముఖ గాయని కౌసల్యది ఇదే తరహా వ్యథ. ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఆమె గృహహింసపై తన అభిప్రాయాలను వెల్లడించింది. పెళ్లయిన తొలినాళ్ల నుంచి భర్తతో విడిపోయేంత వరకూ తాను హింసను అనుభవించానని, అసలు నమ్మివచ్చిన భార్యను కొట్టేవాడు భర్తెలా అవుతాడని ప్రశ్నించింది.

తనను తన తల్లిదండ్రులు టామ్ బాయ్ లా పెంచారని, సింపుల్ గా ఉంటూనే స్పోర్ట్స్ ఆడుతూ ఆనందంగా పెరిగానని తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్న ఆమె, తన మామగారు, నాన్న కొలీగ్సేనని, నా పాటలను నచ్చి పెళ్లి చేసుకుంటున్నానని అప్పుడు కాబోయే భర్త చెబితే, తానెంతో ఆనందించానని, తన ఆనందం అంతే త్వరగా ఆవిరైందని చెప్పుకొచ్చింది.

తన ఫోటోలు చూపించి, ఎవరితోనో సంబంధం పెట్టుకున్నావంటూ హింసించేవాడని, నిదానంగా మాట్లాడుకుందామన్నా వినేవాడు కాదని, ఆయన ఇంటికి వస్తున్నాడంటేనే వణికిపోయేదాన్నని వెల్లడించింది. తాను బయటకు వెళ్లాలంటే, భర్తకు అనుమానం వస్తుందన్న ఆందోళనతో ఆయన్నే తీసుకెళ్లేదాన్నని, అయినా తనకు బాధ తప్పలేదని వాపోయింది. ఇప్పుడు తన జీవితాన్ని ఒంటరిగానే గడుపుతున్నానని, తన లోపం లేకుండానే జీవితం నాశనమైందన్న బాధ మిగిలిందని, పాటలు పాడటంలో మనశ్శాంతిని వెతుక్కుంటూ, పిల్లాడిని పెంచుకుంటూ ఉన్నానని చెప్పింది.
Singar Kousalya
Domestic Violence

More Telugu News