కేసీఆర్‌కి ఫోన్ చేసి 'హ్యాపీ బర్త్ డే' చెప్పిన చంద్రబాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్‌కి ఫోన్ చేసి 'హ్యాపీ బర్త్ డే' చెప్పిన చంద్రబాబు!

  • ఈ రోజు కేసీఆర్‌ పుట్టిన రోజు
  • తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరిపిన టీఆర్‌ఎస్‌ నేతలు
  • గుంటూరులోనూ కేసీఆర్‌ బర్త్ డే జరిపిన అభిమాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా నేతలిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మరోపక్క, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు టీఆర్ఎస్ నాయ‌కులు కేసీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకున్నారు. ప‌లు చోట్ల పేద‌ల‌కు బ‌ట్ట‌లు పంచారు.  
   గుంటూరులోనూ కేసీఆర్ జ‌న్మ‌దిన   వేడుక‌లు...
గుంటూరు జిల్లా తెనాలిలో ఖాదిర్‌ అనే వ్యక్తి కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేసి అనాథాశ్రమంలో మహాన్నదానం నిర్వహించారు. అనంత‌రం చాకలి చెరువు వద్ద కేక్ కట్ చేసి, పేదలకు చీరెలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ రాజీలేని పోరాటం చేశారని ఖాదిర్ కొనియాడారు. కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఏపీలో ప్ర‌త్యేక‌ హోదా కోసం పోరాటం చేయాలన్నారు. 
KCR
birth day
Chandrababu
Andhra Pradesh
Telangana

More Telugu News