వరుణ్ తేజ్‌ 'తొలిప్రేమ' తొలివారం కలెక్షన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుణ్ తేజ్‌ 'తొలిప్రేమ' తొలివారం కలెక్షన్లు!

  • రాబట్టిన మొత్తం గ్రాస్ రూ.34 కోట్లు 
  • నైజాం ఏరియాలో షేర్ 5.40 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తొలిప్రేమ తొలి వారం షేర్‌ 14.03 కోట్లు
మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'తొలిప్రేమ' సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలివారం కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ సినిమా పలు ప్రాంతాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు రూ.కోట్లలో.. నైజాం-5.40, సీడెడ్‌-1.70, నెల్లూరు-0.43, గుంటూరు -1.14, కృష్ణా 1.07, వెస్ట్-0.93, ఈస్ట్-1.18, ఉత్తరాంధ్ర 2.15, కర్ణాటక 1.20, అమెరికా 2.30, ఇతర ప్రాంతాల్లో 0.80 వ‌చ్చాయి. మొత్తానికి తొలి వారంలో 'తొలిప్రేమ' 18.33 కోట్ల రూపాయ‌ల షేర్ రాబ‌ట్టింది.

కాగా, ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే తొలిప్రేమ తొలి వారం షేర్‌ 14.03 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ రూ.34 కోట్లు. 'ఫిదా' సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్న వ‌రుణ్ తేజ్.. ఆ సినిమా త‌రువాత న‌టించిన‌ ఈ 'తొలిప్రేమ' సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించారు.  
varun tej
tholi prema
collectons

More Telugu News