సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం: ఎంపీ కవిత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం: ఎంపీ కవిత

  • కేసీఆర్ బర్త్ డే .. వీడియో సాంగ్ రూపొందించిన యూత్ వింగ్ 
  • ఆ సాంగ్ ను లాంచ్ చేసిన ఎంపీ కవిత
  • సంక్షేమ పథకాలను వివరించే విధంగా ఈ పాట రూపకల్పన
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ వీడియో సాంగ్ ను ఎంపీ కవిత ఆవిష్కరించారు. టీఆర్ ఎస్ యూత్ వింగ్ దీనిని రూపొందించింది. ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడుతూ, టీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేక్, కుత్బుల్లాపూర్ యువ నాయకులందరూ కలిసి మంచి పాటను రూపొందించారని అభినందించారు.

 రాష్ట్రంలోని ప్రతి సంక్షేమం పథకం కేసీఆర్ ఆలోచనలో నుంచి పుట్టినదేనని, వాటన్నింటినీ వివరించే విధంగా ఈ పాటను రూపకల్పన చేశారని, సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఈ పాట కూడా ఓ కానుక అని, ఈ కానుక ప్రత్యేకంగా నిలవాలని, తమ యువ మిత్రులందరూ పడ్డ కష్టాన్ని కేసీఆర్ గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కవిత అన్నారు.
kcr
K Kavitha

More Telugu News