Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తొలిప్రేమ' హిట్ తో నాగబాబుకు వరుణ్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు: చిరంజీవి

  • డైరెక్టర్ పనితీరు బాగుంది 
  • వరుణ్ తేజ్ మెప్పించాడు
  • టెక్నీషియన్స్ ప్రధానమైన పాత్రను పోషించారు
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'తొలిప్రేమ' ఈ నెల 10వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఈ సినిమా దర్శకనిర్మాతలను .. వరుణ్ తేజ్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి .. సత్కరించారు.

"పవన్ కల్యాణ్ చేసిన 'తొలిప్రేమ' టైటిల్ తో రావడంతో, ఈ సినిమాపై క్యూరియాసిటీ కలిగింది. భావోద్వేగాలతో కూడిన కథగా ఈ సినిమా కొనసాగింది. ఈ సినిమా ఇంత ఫ్రెష్ గా అనిపించడానికీ .. నాయకా నాయికలు కొత్తగా కనిపించడానికి డైరెక్టర్ థాట్ కారణం. రాశి ఖన్నా చాలా బాగా చేసింది. ఇక వరుణ్ తేజ్ హైట్ కారణంగా డాన్సులు ఎంతవరకూ కుదురుతాయా అని లోలోపల అనుమానంగా ఉండేది. కానీ స్టెప్స్ చాలా బాగా వేశాడు .. నటన పరంగాను మెగా ఫ్యామిలీ గర్వపడేలా చేశాడు. ఈ సినిమా సక్సెస్ నాగబాబుకు వరుణ్ తేజ్ ఇచ్చిన గిఫ్ట్. నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు ..  తమన్ సంగీతం .. శేఖర్ మాస్టర్ డాన్సులు .. జార్జ్ కెమెరా పనితనం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి" అంటూ చిరంజీవి ఆ సినిమా టీమ్ ను అభినందించారు.         
varun tej
rasi khanna

More Telugu News