టాలీవుడ్ టాక్... 'తోక కత్తిరిస్తా'నని శివాజీరాజా వార్నింగ్ ఇచ్చింది ఈ హీరోయిన్లకేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ టాక్... 'తోక కత్తిరిస్తా'నని శివాజీరాజా వార్నింగ్ ఇచ్చింది ఈ హీరోయిన్లకేనట!

  • 'మా' కార్యక్రమాలకు హీరోయిన్లు రావడం లేదని శివాజీరాజా నిప్పులు
  • కనీసం ఆర్టిస్టుగా సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని మండిపాటు
  • కాజల్, తమన్నాల గురించేనని టాలీవుడ్ లో గుసగుసలు
త్వరలో సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సెలబ్రేషన్స్ గురించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న వేళ, మా అధ్యక్షుడు, నటుడు శివాజీరాజా కొందరు హీరోయిన్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మా నిర్వహించే కార్యక్రమాలకు హీరోయిన్లు హాజరు కావడం లేదని, పలువురిని తెలుగు చిత్ర పరిశ్రమ పెంచి పోషిస్తుంటే, వారు కనీసం ఆర్టిస్టుగా సభ్యత్వం కూడా తీసుకోవడం లేదని, అలాంటి వారి తోకలను కత్తిరిస్తామని హెచ్చరించాడు.

ఇక శివాజీరాజా హెచ్చరించింది ప్రముఖ హీరోయిన్లు కాజల్, తమన్నాలనేనని టాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది. వీరు ఎన్నిసార్లు అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించినా, కేర్ చేయడం లేదని, కాస్తంత గట్టిగా అడిగితే, డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకే శివాజీరాజాకు అంత కోపం వచ్చిందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. శివాజీరాజా వార్నింగ్ ఎవరికిచ్చినా, ఇకనుంచైనా తెలుగు చిత్రాల్లో నటిస్తూ, కోట్లాది రూపాయల డబ్బును సంపాదిస్తున్న నటీమణులు దారికి వస్తారేమో వేచి చూడాలి.
Tollywood
Sivaji Raja
Kajal Agarwal
Tamannaah

More Telugu News