మీ వాహనానికి 15 ఏళ్లు నిండాయా?.. అయితే జాగ్రత్త!
- 15 ఏళ్లు నిండిన వాహనాలకు బ్రేక్
- తుది రూపు సంతరించుకుంటున్న నూతన విధానం
- ఇక పాత వాహనాలన్నీ తుక్కే
15 ఏళ్లు నిండిన వాహనాలను స్క్రాప్ (తుక్కు)గా మారుస్తామని మంత్రి తెలిపారు. దేశం ఆటోమొబైల్ రంగానికి ప్రధాన కేంద్రం కాబోతోందన్న గడ్కరీ.. వాహనాల తుక్కును వాహనాల విడిభాగాలు, ఇతర వస్తువుల తయారీకి ఉపయోగిస్తామని వివరించారు. ఫలితంగా ముడి సరుకులు మరింత చవగ్గా లభిస్తాయని, ఉత్పాదక వ్యయం గణనీయంగా తగ్గుతుందని అన్నారు.