నీరవ్ మోదీ ప్రకంపనలు... పీఎన్బీ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్...!
- తొలుత రూ. 280 కోట్ల మోసం జరిగినట్టు ప్రకటన
- ఆపై అది రూ. 11,300 కోట్లకు పెరిగిన వైనం
- ఈ వ్యవహారంలో దాదాపు 30 బ్యాంకులు ఇరుక్కున్న వైనం
- వారిని రప్పించడం సులభం కాదంటున్న నిపుణులు
ఇక ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు రహస్యంగా నీరవ్ మోదీకి దోచిపెట్టినట్టుగా ఈ వ్యవహారం కనిపించడం లేదని కుంభకోణాన్ని విచారించేందుకు రంగంలోకి దిగిన అధికారులు భావిస్తున్నారు. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ విశ్వసనీయత ఏంటో తెలుసుకోకుండా పలు బ్యాంకులు రుణాలను మంజూరు చేయడంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. నీరవ్ మోదీ వ్యవహారం 2010 నుంచి సాగుతోందని, 2015లో నరేంద్ర మోదీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కుంభకోణం గురించి తొలిసారిగా వెల్లడించిన వ్యక్తి ఆరోపిస్తున్నాడు.
ఇక ఇప్పటికే విదేశాలకు పారిపోయిన నీరవ్ ను అంత సులభంగా ఇండియాకు రప్పించలేమని విజయ్ మాల్యా, లలిత్ మోదీ వ్యవహారాలను చూసిన వారు అంటున్నారు. నీరవ్ భారత పౌరుడే అయినప్పటికీ, ఆయన భార్య అమీకి అమెరికా పౌరసత్వం, సోదరుడు నిషాల్ కు బెల్జియం పౌరసత్వం ఉన్నాయి. వీరిని ఇండియాకు రప్పించడం అంత సులభమేమీ కాదని అంచనా. కష్టపడి సంపాదించుకున్న డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటుంటే, వాటినిలా మోసగాళ్లకు ధారాదత్తం చేయడం ఏంటని ప్రజలు బ్యాంకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.