అమెరికాలో దారుణాతి దారుణం.. కాల్పుల్లో 17 మంది విద్యార్థుల మృతి!
- తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నందుకు రెచ్చిపోయిన పూర్వ విద్యార్థి
- స్కూల్కు చేరుకుని విచక్షణ రహితంగా కాల్పులు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
తుపాకితో స్కూల్ కు చేరుకున్న క్రజ్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎదురు కాల్పులు ప్రారంభించి క్రజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.