జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు లేదా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయం: వర్ల రామయ్య

  • ఏప్రిల్ 6న కాదు తక్షణం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి
  • బీజేపీ-టీడీపీ మైత్రి కొనసాగుతుంది
  • ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని నమ్ముతున్నాం: వర్ల
సీబీఐ, ఈడీ కేసుల్లో తీర్పు వస్తే వైసీపీ అధినేత జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు లేదా తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇడుపులపాయలో అసైన్డ్ భూముల వివరాలు జగన్ చెప్పాలని, జగన్ బంధువుల పేరున ఉన్న దళితుల భూముల వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 6న జగన్ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే కనుక ఉపఎన్నికలు ఉండవని, చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బీజేపీతో తమ పొత్తు గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ-టీడీపీ మైత్రి కొనసాగుతుందని, ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుందని నమ్ముతున్నామని అన్నారు.
Go Back to Shorts
YSRCP
Jagan
Telugudesam
varla ramaiah

More Telugu News