హైదరాబాద్‌లోని మంజీరా మాల్‌లో రచ్చ రచ్చ చేసిన భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు

  • ప్రేమ జంట‌ల‌ను ఆకర్షించ‌డానికి మంజీరా మాల్ ప్ర‌త్యేక ఏర్పాట్లు
  • డెక‌రేష‌న్ ధ్వంసం
  • మన సంస్కృతి కాదంటోన్న భజరంగ్ దళ్ కార్యకర్తలు
ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ప్రేమ జంట‌ల‌ను ఆకర్షించ‌డానికి హైదరాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని మంజీరా మాల్ ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. షాప్ లో ల‌వ్ సింబ‌ల్స్ తో ఫుల్లుగా డెక‌రేష‌న్ చేసింది. ఇలా చేస్తే ఈ రోజు ల‌వ‌ర్స్ తో త‌మ షాపు కళకళలాడి, భారీగా గిరాకీ వస్తుంద‌ని యోచించింది. కానీ, సీన్ రివ‌ర్స్ అయింది.

అందులోకి దూసుకొచ్చిన భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు ర‌చ్చ ర‌చ్చ చేశారు. నిర్వాహ‌కులు చేసిన డెక‌రేష‌న్ ను ధ్వంసం చేశారు. అక్క‌డ బెలూన్ ల‌తో ఉంచిన ల‌వ్ సింబ‌ల్స్ ను ట‌పాట‌పా ప‌గుల‌కొట్టేశారు. ఇంత జ‌రుగుతున్నా అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ల‌ని అడ్డుకోలేక‌పోయారు. ప్రేమికుల రోజును జరుపుకోవడం మన సంస్కృతి కాదని భజరంగ్ దళ్ కార్యకర్తలు అన్నారు. 
Go Back to Shorts
bhajarangdal
Hyderabad
walentanceday

More Telugu News