Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరందరూ నన్ను దీవిస్తే వచ్చే ఏడాదికైనా ఒక అమ్మాయితో ఉంటా: హీరో నాగశౌర్య

  • మీ ప్రేమకు అమ్మాయి ఒప్పుకోకపోతే ఎప్పుడూ ఇబ్బందిపెట్టొద్దు
  • మీ ప్రేమను పాజిటివ్ గా, సాఫ్ట్ గా వ్యక్తం చేయండి
  • ప్రేమ సక్సెస్ అయితే పెళ్లికి .. పిల్లలు కూడా పుడితే వాళ్ల స్కూల్ ఫీజ్ కు ఆల్ ది బెస్ట్: నాగశౌర్య
‘మీరందరూ నన్ను దీవిస్తే వచ్చే ఏడాదికైనా ఒక అమ్మాయితో ఉంటాను .. దీవించండి’ అంటూ  ప్రముఖ హీరో నాగశౌర్య నవ్వులు చిందించాడు. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. మీ ప్రేమను పాజిటివ్ గా, సాఫ్ట్ గా వ్యక్తం చేయండి. మీ ప్రేమకు అమ్మాయి ఒప్పుకోకపోతే ఎప్పుడూ బలవంతపెట్టొద్దు .. ఇబ్బందిపెట్టొద్దు. అలాగే, అమ్మాయిలను అబ్బాయిలు, అబ్బాయిలను అమ్మాయిలు ఇబ్బంది పెట్టొద్దు.

 ప్రేమికుల ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రేమ ఆల్రెడీ సక్సెస్ అయితే పెళ్లికి ఆల్ ది బెస్ట్. పెళ్లి కూడా అయిపోతే పిల్లలు పుట్టడానికి ఆల్ ది బెస్ట్. పిల్లలు కూడా పుడితే వాళ్ల స్కూల్ ఫీజ్ కు ఆల్ ది బెస్ట్...హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని అన్నాడు. మీరందరూ నన్ను దీవిస్తే వచ్చే ఏడాదికైనా ఒక అమ్మాయితో ఉంటానన్నాడు నాగశౌర్య.
naga shourya
Tollywood

More Telugu News