చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తోన్న సమంత.. ‘అభిమన్యుడు’ ‘యాంగ్రీబర్డ్‌’ పాట వీడియో ప్రోమో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తోన్న సమంత.. ‘అభిమన్యుడు’ ‘యాంగ్రీబర్డ్‌’ పాట వీడియో ప్రోమో!

  • విశాల్, సమంత జంటగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ‘అభిమన్యుడు’
  • అందరినీ తన వైపునకు తిప్పుకుంటోన్న సమంత
  • ప్రోమోలో విశాల్‌-సమంతల మధ్య జరిగే సన్నివేశాలు  
విశాల్, సమంత జంటగా పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న తమిళ సినిమా ‘ఇరుబుత్తిరై’ను తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా ‘అభిమన్యుడు’లోని ‘యాంగ్రీబర్డ్‌’ పాట వీడియో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సమంత తన నవ్వులతో, చక్కటి హావభావాలతో అలరించింది.

ఇటీవలే 'రంగస్థలం' సినిమాలోని 'రామలక్ష్మి' టీజర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శామ్‌.. ఇప్పుడు ప్రోమోతో ఇలా అందరినీ తన వైపునకు తిప్పుకుంటోంది. విశాల్‌-సమంతల మధ్య జరిగే సన్నివేశాలు ఇందులో వున్నాయి. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు.      
samanta
abhimanyudu
promo

More Telugu News