Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను నిర్మించే సినిమాల్లో నేను నటించను: హీరో నాని

  • వరుసగా సినిమాలు నిర్మిస్తాను 
  • టాలెంట్ వున్న దర్శకులకు ఛాన్స్ ఇస్తాను  
  • కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తాను
ఒక వైపున హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న నాని, మరో వైపున 'అ!' సినిమాతో నిర్మాతగాను రంగంలోకి దిగాడు. విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఈ సినిమా ఫైనల్ కట్ ఈ రోజు ఉదయమే చూశానని, దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడని అన్నాడు.

ఇకపై సొంత బ్యానర్లో వరుస సినిమాలను నిర్మించే ఆలోచనలో వున్నానని చెప్పాడు. నేపథ్యం .. అనుభవం వంటి వాటికి కాకుండా, కొత్త దర్శకుల టాలెంట్ కి .. కంటెంట్ కి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. సొంత బేనర్లో తీసే సినిమాలలో తాను నటించననీ .. నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. కాగా, దర్శకత్వం పట్ల ఆసక్తితో .. కథలను పట్టుకుని తిరుగుతోన్న కుర్రాళ్లకు నాని శుభవార్తే చెప్పాడనుకోవాలి.    
nani

More Telugu News