నూతన్ ప్రసాద్ ఇల్లు మాకు బాగా కలిసొచ్చింది!: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నూతన్ ప్రసాద్ ఇల్లు మాకు బాగా కలిసొచ్చింది!: పరుచూరి గోపాలకృష్ణ

  • నూతన్ ప్రసాద్ ని ఎన్టీఆర్ కి సిఫార్స్ చేశాం  
  • ఎన్టీఆర్ సాయంతో ఆయన ఇల్లు కట్టుకున్నారు 
  • ఆ ఇంట్లో మేం చాలాకాలం వున్నాం
'పరుచూరి పలుకులు'లో నూతన్ ప్రసాద్ గురించిన విషయాలను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "నూతన్ ప్రసాద్ వరుస సక్సెస్ లను చూశారు. అలాంటి ఆయన సినిమాలు వరుసగా దెబ్బతినడం మొదలెట్టాయి. దాంతో ఆయనకి అవకాశాలులేని పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఎన్టీఆర్ తో మేం చేస్తోన్న 'అనురాగదేవత' సినిమాలో, అల్లు రామలింగయ్య అల్లుడి పాత్రకి పెట్టుకోమని సిఫార్స్ చేశాం".

"అందుకు పెద్దాయన అంగీకరించడమే కాదు .. నూతన్ ప్రసాద్ ఇల్లు కట్టుకోవడానికి ఆర్ధిక సాయం కూడా చేశారు. ఆ ఇల్లు కట్టిన తరువాత .. పై పోర్షన్ ఖాళీగా ఉందని చెప్పి .. మమ్మల్ని అందులో వుండమంటూ నూతన్ ప్రసాద్ ఫోన్ చేశారు. అద్దె ఎంత ఇవ్వమంటారు .. అని నేను అడిగితే, అన్నదమ్ముల మధ్య డబ్బుల ప్రస్తావన ఏంటి? ముందు సామాన్లు పెట్టుకో అన్నారు. అప్పటి నుంచి చాలాకాలం పాటు అక్కడ వున్నాం. ఆ ఇల్లు మాకు బాగా అచ్చొచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్లిన తరువాతనే 'అనురాగదేవత' సూపర్ హిట్ కావడం, ఆ వెంటనే 42 సినిమాలకి గాను అడ్వాన్సులు రావడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చారు.    
nuthan prasad
paruchuri

More Telugu News